ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి తిరుపతికి కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రైలును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, విశాఖపట్నం–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన రూట్ మ్యాప్, హాల్టింగ్ స్టేషన్లు, రైలు వేళలు అంటూ కొన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ కొత్త రైలుపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది. అయితే వైరల్ అవుతున్న రూట్, షెడ్యూల్ వివరాలకు సంబంధించి రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

గమనిక: రైలుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న షెడ్యూల్‌ను ధ్రువీకరించిన సమాచారంగా భావించకూడదు.

ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. నరసాపురం–చెన్నై, సికింద్రాబాద్–తిరుపతి, విశాఖపట్నం–సికింద్రాబాద్ మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పాటు సికింద్రాబాద్–బెంగళూరు వందేభారత్ రైలు కూడా ఏపీ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. మరికొన్ని వందేభారత్ రైళ్లు రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లకు అదనంగా మరిన్ని వందేభారత్ సర్వీసులను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు రైల్వే శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైలును నడపాలనే ప్రతిపాదన చాలాకాలంగా చర్చలో ఉంది. సుదూర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైలుపై ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నం నుంచి తిరుపతికి కొత్త వందేభారత్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రైలు పగటిపూట నడిచేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. విశాఖపట్నం నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు తిరుపతి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని ప్రచారం జరుగుతోంది.

ఈ రైలుకు సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో హాల్టింగ్‌లు కల్పించనున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర నుంచి తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు ఇతర ప్రయాణికులకు కూడా ప్రయోజనం కలగనుంది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న షెడ్యూల్, హాల్టింగ్ వివరాలకు సంబంధించి రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ రైలు రాక, ప్రయాణ వేళలు, స్టాపేజీలపై స్పష్టత రానుంది.

ఇప్పటికే విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైలును నడిపించాలనే ప్రతిపాదన ఉండగా.. తాజాగా విశాఖపట్నం–తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుందనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వందేభారత్ స్లీపర్ రైలును రాత్రి వేళల్లో నడిపించే అవకాశం ఉండగా, విశాఖపట్నం–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను పగటిపూట నడపనున్నట్లు సమాచారం. దీంతో ఈ రెండు రైళ్ల సేవల మధ్య సమయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులు, శ్రీవారి భక్తులకు కొత్త వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. అయితే విశాఖపట్నం–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే రైలు ప్రారంభ తేదీ, షెడ్యూల్, హాల్టింగ్‌లపై స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *