పులిసిన పెరుగు లేదా మజ్జిగతో ఇంట్లోనే సులభంగా, తక్కువ సమయంలో రుచికరమైన మజ్జిగ పులుసును తయారు చేసుకోవచ్చు. ఆంధ్ర సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైన ఈ వంటకాన్ని అందుబాటులో ఉండే కొన్ని సాధారణ పదార్థాలతోనే సిద్ధం చేయవచ్చు. మజ్జిగ పులుసును రుచిగా, సులభంగా తయారు చేసుకునే విధానం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

మజ్జిగ పులుసు.. తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సులభమైన వంటకం. ఇంట్లో మిగిలిపోయిన పెరుగు లేదా పులిసిన పెరుగుతో దీన్ని తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. ఎక్కువ పదార్థాలు అవసరం లేకుండానే సింపుల్‌గా సిద్ధం చేసుకునే మజ్జిగ పులుసు అన్నంలోకి మంచి కాంబినేషన్‌గా ఉంటుంది. మరి ఈ రుచికరమైన మజ్జిగ పులుసును తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకటన
కావాల్సిన పదార్థాలు:
- పులిసిన పెరుగు లేదా మజ్జిగ: 300 గ్రాముల నుంచి అర కిలో వరకు
- పచ్చిమిర్చి: 4
- అల్లం: ఒక ఇంచు ముక్క
- ఉల్లిపాయ: 1 (మీడియం సైజు)
- నూనె: 2 టేబుల్ స్పూన్లు
- శనగపప్పు: 1 టీ స్పూన్
- మినప్పప్పు: 1 టీ స్పూన్
- ఆవాలు: 1 టీ స్పూన్
- జీలకర్ర: అర టీ స్పూన్
- ఎండుమిర్చి: 1
- కరివేపాకు: కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు: 3–4
- పసుపు: అర టీ స్పూన్
- ఉప్పు: రుచికి సరిపడా
- కొత్తిమీర: సన్నగా తరిగింది
తయారీ విధానం:
పెరుగు సిద్ధం చేసుకోవాలి: ముందుగా పులిసిన పెరుగును ఒక గిన్నెలోకి తీసుకుని గరిటె లేదా చిలకతో బాగా చిలకాలి. పెరుగు మరీ పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మజ్జిగ పులుసు మంచి రుచితో, సరైన చిక్కదనంతో వస్తుంది. పులిసిన పెరుగు ఉపయోగించడం వల్ల పులుసుకు సహజమైన పులుపు, మంచి రుచి లభిస్తుంది.
మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి: ఇప్పుడు రోట్లో లేదా మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, అల్లం వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అనంతరం మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి కలిపి దంచాలి. ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ముతకగా ఉండేలా దంచుకుంటే మజ్జిగ పులుసుకు మంచి రుచి వస్తుంది. దంచిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
