
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి సగటున 21.12 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు 11.719 శాతంగా ఉన్న పోలింగ్.. రెండు గంటల్లోనే 21.12 శాతానికి చేరుకుంది. దీంతో ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది.
జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు
ఉదయం 11 గంటల వరకు మార్కాపురం జిల్లాలో 34.66 శాతం పోలింగ్ నమోదైంది. అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్) జిల్లాలో అత్యల్పంగా 11.81 శాతం ఓటింగ్ నమోదైనట్లు వివరాలు వెల్లడించాయి.
ఇతర జిల్లాల్లో విశాఖపట్నంలో 35.4 శాతం, పల్నాడులో 32.02 శాతం, కడపలో 29.31 శాతం, కాకినాడలో 27.25 శాతం, ఏలూరులో 26.6 శాతం, గుంటూరులో 23 శాతం పోలింగ్ నమోదైంది.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
ఉదయం 9 గంటలకు నమోదైన ఓటింగ్ శాతం
ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సగటు పోలింగ్ 11.719 శాతంగా ఉంది. ఆ సమయంలో పల్నాడు జిల్లాలో 12 శాతం, అనంతపురంలో 9.44 శాతం, కాకినాడలో 8.83 శాతం ఓటింగ్ నమోదైంది. కడప జిల్లాలో అత్యల్పంగా 0.5 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
ఉదయం 9 గంటలతో పోలిస్తే 11 గంటల సమయానికి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఓటింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.
