: Head Constable Nagaraju Wins Praise for Carrying Elderly Woman to Polling Booth in Gannavaram

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కృష్ణా జిల్లాలో మానవత్వాన్ని చాటే ఘటన చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలికి సహాయం చేసి పోలీస్‌ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు పలువురి ప్రశంసలు అందుకున్నారు.

గన్నవరం జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి ఓ వృద్ధ మహిళ ఓటు వేసేందుకు వచ్చారు. అయితే ఆమె నిలబడలేని, నడవలేని పరిస్థితిలో ఉండటాన్ని అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు గమనించారు.

వెంటనే స్పందించిన ఆయన.. వృద్ధురాలికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన చేతులతో ఎత్తుకుని పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమె ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించారు.

For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital

విధి నిర్వహణలో ఉంటూనే వృద్ధురాలికి అండగా నిలిచిన నాగరాజు సేవాభావంపై స్థానికులు, పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించడంలో పోలీసుల బాధ్యతను ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.