
ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్లో కూటమి పార్టీల అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ZPTC, MPTC స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల కంటే కూటమి అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
తాజా కౌంటింగ్ అప్డేట్స్ ప్రకారం ZPTC స్థానాల్లో కూటమి అభ్యర్థులు 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, వైసీపీ అభ్యర్థులు 13 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.https://dtvandhrapradesh.com
MPTC స్థానాల్లోనూ కూటమి పార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కూటమి అభ్యర్థులు 1,958 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, వైసీపీ అభ్యర్థులు 98 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో ఈ ఆధిక్యాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. తుది ఫలితాలు వెలువడే కొద్దీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయనే దానిపై స్పష్టత రానుంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలు కౌంటింగ్ సరళిని ఆసక్తిగా గమనిస్తున్నాయి.https://dtvandhrapradesh.com
