కావాల్సిన పదార్థాలు

  • కోడిగుడ్లు – 4
  • నల్ల మిరియాలు – అర టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయలు – 3
  • టమాటాలు – 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • పసుపు – పావు టేబుల్ స్పూన్
  • కారం – 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర – అర టేబుల్ స్పూన్
  • కరివేపాకు – 2 రెబ్బలు
  • కొత్తిమీర – కొద్దిగా
  • నూనె – 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు – తగినంత

తయారీ విధానం

1. ముందుగా గుడ్లను వేయించుకోవాలి

ముందుగా కోడిగుడ్లను బాగా ఉడికించి, పొట్టు తీసేయాలి. అనంతరం గుడ్లకు చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి. ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి, చిటికెడు పసుపు, ఉప్పు వేసి గుడ్లను జోడించాలి. గుడ్లు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2. మసాలా తయారు చేసుకోవాలి

అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. అనంతరం టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మెత్తగా మగ్గించాలి.

3. మిరియాల మసాలా కలపాలి

టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా జాగ్రత్తగా వేయించాలి.

4. గుడ్లను గ్రేవీలో ఉడికించాలి

ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి సుమారు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను గ్రేవీలో వేయాలి. మసాలాలు గుడ్లకు బాగా పట్టేలా మరో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.

5. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి

గ్రేవీ చిక్కబడిన తర్వాత తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఘాటైన మిరియాల రుచితో నోరూరించే మిరియాల కోడిగుడ్డు కూర సిద్ధం!

వేడి వేడి అన్నం, చపాతీ లేదా రోటీలతో ఈ కూరను సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మిరియాల ఘాటు ఇష్టపడేవారు తప్పకుండా ఈ రెసిపీని ప్రయత్నించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *