
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభించిన ఏఎస్బీఎల్ (ASBL) లెగసీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు తొలిరోజే భారీ స్పందన లభించింది. ప్రారంభమైన మొదటి రోజే రూ.800 కోట్ల విలువైన ఫ్లాట్ల విక్రయాలు నమోదైనట్లు సంస్థ సీఈఓ అజితేశ్ కొరుపోలు వెల్లడించారు.
ఇంటి స్వాధీనం వరకు జీరో ఈఎంఐ ఆఫర్
ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ‘జీరో ఈఎంఐ టిల్ హ్యాండోవర్’ ప్రత్యేక పథకాన్ని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం కొనుగోలుదారులు బుకింగ్ మొత్తం చెల్లించిన తర్వాత, నిర్మాణం పూర్తై ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకునే వరకు బ్యాంకు రుణంపై చెల్లించాల్సిన వడ్డీని సంస్థే భరిస్తుంది. దీంతో గృహ కొనుగోలుదారులపై నిర్మాణ సమయంలో ఆర్థిక భారం తగ్గనుంది.
7.97 ఎకరాల్లో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు
దాదాపు 7.97 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మూడు భారీ రెసిడెన్షియల్ టవర్లను నిర్మించనున్నారు. 1,970 నుంచి 3,015 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు రూ.1.99 కోట్ల నుంచి ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది.
