ప్రియుడిపై మోజు.. కన్న కొడుకుపై కర్కశత్వం.. ఓ తల్లి నిర్వాకం! చిన్నారి మర్మాంగంపై బ్లేడ్‌తో..

Date:

చిత్తూరు జిల్లా వీ.కోటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి, తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించగా, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మానవత్వం మంటగలిసిపోతోంది. అనుబంధానికి మారుపేరుగా నిలిచే తల్లి ప్రేమ కూడా వివాహేతర సంబంధం కోసం కర్కశంగా మారుతోంది. ప్రియుడితో ఉండేందుకు కన్న కొడుకు అడ్డుగా ఉన్నాడని, పాపం పసివాడని కూడా చూడకుండా కన్న తల్లే చిత్రహింసలు పెట్టింది. ఈ దారుణం ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వీ.కోట మండలంలోని ఈశ్వర్‌నగర్‌లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి, తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలుడి శరీరంపై, మర్మాంగాల వద్ద బ్లేడ్‌తో గాయపరిచినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశ్వర్ నగర్‌కు చెందిన ఇంద్రజ తన ఏడేళ్ల కుమారుడు విశాల్‌తో కలిసి నివాసం ఉంటోంది. కొద్ది నెలల క్రితం ఆమె భర్త మరణించగా, అనంతరం ఎర్రచేనుకు చెందిన రాజుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్లు విచారణలో వెల్లడైంది. ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించడంలో కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి, ఆమెతో ఉన్న వ్యక్తి బాలుడిని తీవ్రంగా హింసిస్తుండగా, అతని కేకలు విన్న ఇంటి యజమాని సావిత్రమ్మ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఘటన అనంతరం ఇంద్రజ, రాజు ఇద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బాలుడిపై జరిగిన దాడికి గల పూర్తి కారణాలు, ఘటన వెనుక ఉన్న పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....