తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ

Date:

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. గత రాత్రి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 124 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో రోజంతా ముసురు వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉత్తర, మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు

తెలంగాణలో చాలా రోజుల తర్వాత వర్షాకాలం ఫీల్ కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో రాత్రి వేళల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదు కానంతగా వర్షపాతం నమోదు కావడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 124 మి.మీ, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 109.5 మి.మీ వర్షపాతం రికార్డైంది.

కాగా, రానున్న 24 గంటలు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రోజంతా ముసురు పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. రాబోయే మూడు గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి , ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే మెదక్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని చెప్పారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, మెదక్, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చునని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....