
హెయిర్ ఫాల్ మొదలైతే చాలామందిలో గుబులు మొదలవుతుంది. దీంతో వెంటనే ఖరీదైన హెయిర్ సీరమ్స్, షాంపూలు, సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతారు. కానీ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ మాత్రం జుట్టు సంరక్షణలో ఖరీదైన ఉత్పత్తుల కంటే సరైన పద్ధతి ముఖ్యమని చెబుతున్నారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, చుండ్రు సమస్యను దూరం చేయడానికి ఓ నేచురల్ టిప్‌ను జావెద్ హబీబ్ షేర్ చేసుకున్నారు. అదేంటో ఈ స్టోరీలో చూసేయండి.
చాలామంది జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆవనూనెను తలకు అప్లయ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆవనూనెను తడి జుట్టుకు అప్లయ్ చేసుకోవాలని జావెద్ హబీబ్ సూచించారు. ముందుగా జుట్టును తడిపి, తర్వాత ఆవాల నూనెను తలకు అప్లయ్ చేసి 5-10 నిమిషాలు పాటు ఉంచాలి. అనంతరం షాంపూ లేదా కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తగ్గుతుందని జావెద్ హబీబ్ అన్నారు.
ఈ హెయిర్ టిప్ రోజూ ఫాలో అయితే జుట్టు చిట్టిపోదని జావేద్ హబీబ్ సూచించారు. సాధారణంగా 50 ఏళ్లు వచ్చే వరకు ఎవరి జుట్టూ చిట్లిపోదు. ఒకవేళ మీ జుట్టు తెగిపోతుంటే.. హెయిర్ బ్రేక్‌ను కంట్రోల్ చేయడానికి 50 ఏళ్లు నిండకముందే జుట్టు రాలడం తగ్గించడానికి ప్రతిరోజూ తలస్నానం చేయడం అవసరమని కూడా హబీబ్ వివరించారు.
ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.

