బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం వివిధ బ్యాంకులు నోటిఫికేషన్ జారీ చేశాయి. వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల్లో చేరడానికి రాయాల్సిన ఎగ్జామ్స్, కావాల్సిన అర్హతలు ఏమిటంటే…

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 35 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: ట్రేడ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌(జెఎంజీఎస్‌-14, ఎంఎజీఎస్‌ 21)

అర్హత: సంబంధిత డిగ్రీకి తోడు ఎల్‌ఐబీఎఫ్‌ నుంచి ఫోరెక్స్‌ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్‌ ఉండాలి. డాక్యుమెంటరీ క్రెడిట్‌ స్పెషలిస్ట్‌ సర్టిఫికెట్‌ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

ఎంపిక: అర్హతలు ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌, ఆపై ఇంటర్వ్యూ

దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 19

వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో స్పెషల్‌ క్యాడర్‌

ఎస్‌బీఐ – ఒప్పంద ప్రాతిపదికన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలకు సంబంధించి స్పెషలిస్ట్‌ క్యాడర్‌ పోస్టులకూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు: జోనల్‌ హెడ్‌(రిటైల్‌)-1, రీజినల్‌ హెడ్‌-5, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ – టీమ్‌ లీడ్‌-24, ఇన్వె్‌స్టమెంట్‌ స్పెషలిస్ట్‌-9, ఇన్వె్‌స్టమెంట్‌ ఆఫీసర్‌-4, వీసీ వెల్త్‌-91, ఏవీసీ వెల్త్‌-73

అర్హతలు: డిగ్రీ/ఎంబీఏ/సీఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతకు తోడు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 25

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *