D Spiritual: Oct 31: ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అన్నప్రసాద వితరణకు రూ.10 లక్షల విరాళం

తిరుపతి / ఒంటిమిట్ట, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహణ కోసం టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు రూ.10,01,116 విరాళంగా అందజేశారు.

ఈ మేరకు శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తన సతీమణితో కలిసి సదాశివరావు విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్రకు అందించారు.

ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఉప కార్యనిర్వహణాధికారి ఎ. ప్రశాంతి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *