
D Educt: Oct 31: నీట్-యూజీ కౌన్సెలింగ్: ప్రత్యేక రౌండ్ల షెడ్యూల్ విడుదల
నీట్-యూజీ కౌన్సెలింగ్‌లో అఖిల భారత కోటాలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి కేంద్ర వైద్య ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్ఎస్) అక్టోబరు 30న ప్రత్యేక రౌండ్ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎంబీబీఎస్ కోర్సులకు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఐదు, ఆరు విడతల కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది.
ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్‌తో పాటు బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ఐదో విడత కౌన్సెలింగ్‌కు నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 5, 6 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. నవంబర్ 7న ఫలితాలను ప్రకటిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు అదే రోజు నుంచి నవంబర్ 16వ తేదీ సాయంత్రంలోపు కేటాయించిన కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ఆరో విడత కౌన్సెలింగ్ కోసం నవంబర్ 17 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. నవంబర్ 19న సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టి, 20న ఫలితాలను వెల్లడించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 21 నుంచి 28వ తేదీ సాయంత్రంలోపు సంబంధిత కళాశాలల్లో చేరాలి.
