ఆరోగ్యానికి మేలు చేసే గేగులు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. సీజనల్‌ ఉపాధిలో భాగంగా రైతులు గేగులను సాగు చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అందుబాటు ధరల్లో లభిస్తుండటంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

D news:nov:14ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు కలిగిన గేగులు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. సీజనల్‌ ఉపాధిలో భాగంగా రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌కు గేగులను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అందుబాటు ధరల్లో లభిస్తుండటంతో పాటు చక్కని రుచిని కలిగి ఉండటంతో ప్రజలు వీటిని ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. రుచితోపాటు పోషకాలు సమృద్ధిగా ఉండే గేగులకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.

తాటిచెట్లకు ముంజల గెలలు కాస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు వాటిని కోసి, లోపల ఉండే ముంజలను తింటారు. కాయలు ముదిరిన తర్వాత పండ్లుగా మారి నేలపై రాలిపోతాయి. కొందరు రైతులు ఈ పండ్లను ఏరి పొలాల గట్లపై నీరు పారే ప్రాంతాల్లో పాతిపెడతారు. అవి మొలకెత్తి పెరుగుతున్న దశలో వాటిని తవ్వి తీసి, ఆకులను కత్తిరిస్తారు. అనంతరం కాండాన్ని కుండలో ఉడకబెట్టడం లేదా దోరగా కాల్చడం చేస్తారు. పైపొరను తొలగించడంతో తినడానికి అనువైన రుచికరమైన గేగులు తయారవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *