ఏపీలో IPSల బదిలీలు.. అమరావతిలో కొత్తగా కీలక అధికారికి బాధ్యతలు.. తాడిపత్రిలోనూ మార్పులు

Date:

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనాపరమైన కారణాలతో ఆరుగురు ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడంతో పాటుగా కొత్త పోస్టింగ్‌లు కల్పించింది. కొత్త జిల్లాలైన మార్కాపురం, పోలవరానికి ఓఎస్డీ (అడ్మిన్)లను నియమించింది. అమరావతిలో ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్)గా కీలక అధికారిని నియమించారు. తాడిపత్రి ఏఎస్పీని పల్నాడు జిల్లాకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలకు అధికారుల్ని కేటాయించడంతో పాటుగా పలువుర్ని ఓఎస్డీలు, అడిషనల్ ఎస్పీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రాను నియమించారు. పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్ఫోన్స్‌ను నియమించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్‌ దేవ్‌ రాజ్‌ను నియమించింది. అమరావతి ఓఎస్డీగా మనోజ్‌ రామనాథ్‌ హెగ్డే (లా అండ్ ఆర్డర్‌)ను, పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీగా రోహిత్‌ కుమార్‌ చౌదరి, నంద్యాల ఏఎస్పీగా సుస్మితను నియమించారు. పరిపాలనా అవసరాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం ఈ బదిలీలలో కొత్త రాజధాని అమరావతి ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్‌)గా రామనాథ్‌ హెగ్డేను నియమించింది. ఆయన 2021-2022 ఏపీ బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా.. ప్రస్తుతం రాజంపేట ఏఎస్పీగా ఉన్నారు. ఆయనకు అమరావతిలో కీలక బాధ్యతలు అప్పగించారు. చింతపపల్లి ఏఎస్పీగా ఉన్న నవజ్యోతి మిశ్రాను మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. నంద్యాల ఏఎస్పీగా ఉన్న మందా జవాలి అల్ఫోన్స్‌ను పోలవరం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్)‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. కాకినాడ ఏఎస్పీగా ఉన్న పాటిల్ దేవ్రాజ్ మనీష్‌ను అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజమహేంద్రవరం బదిలీ చేశారు. తాడిపత్రి ఏఎస్పీగా ఉన్న రోహిత్ కుమార్ చౌదరిని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా ఉన్న సుస్మితను నంద్యాల ఏఎస్పీగా బదిలీ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాపం గుర్నూర్ బ్రార్‌.. పీడకలలా మారిన లార్డ్స్ వన్డే..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత...

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి...

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్...

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్...