గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, ప్రియాంక అంత్యక్రియలు ఇవాళ ఆమె స్వగ్రామంలో జరగనున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్‌ గ్రామంలో ప్రియాంకకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలకనున్నారు. మరికొన్ని గంటల్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మెడికో ప్రియాంకకు నేడు తుది వీడ్కోలు

రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. సుమారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మెడికో ప్రియాంక చివరకు ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు నేడు స్వగ్రామంలో జరగనున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్‌ గ్రామంలో ప్రియాంకకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తుది వీడ్కోలు పలకనున్నారు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం పూర్తైన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తరలించనున్నారు.

మధ్యాహ్నం లోపు ప్రియాంక మృతదేహం ఏక్లాస్‌పూర్‌లోని ఆమె ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రియాంక స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్. ఆమె రెండో తరగతి వరకు ఏక్లాస్‌పూర్‌లోనే చదువుకుంది. అనంతరం పిల్లల భవిష్యత్తు, చదువుల కోసం ప్రియాంక తల్లిదండ్రులు కర్నూలులో స్థిరపడ్డారు. దీంతో ఆమె మిగతా విద్యాభ్యాసాన్ని కర్నూలులోనే కొనసాగించింది.

చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన ప్రియాంక.. కష్టపడి చదివి మెడిసిన్‌లో సీటు సాధించింది. అనంతరం ఎంబీబీఎస్‌ విద్యను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రియాంకకు ఇద్దరు చెల్లెల్లు ఉండగా.. ఆమె కుటుంబంలో పెద్ద కుమార్తె. పెద్ద కూతురిగా బాధ్యతగా ఉంటూనే చదువుపై దృష్టి పెట్టి వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్‌గా ఎదిగింది.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని GSL మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ సెకండియర్ చదువుతున్న ప్రియాంక.. ఇటీవల తన స్నేహితుడితో కలిసి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొంతకాలంగా చికిత్స పొందుతున్న ప్రియాంక.. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.