D news:nov:18చర్మంపై ఎర్రటి దద్దుర్లు, తీవ్రమైన దురద, మంట, చిన్న చిన్న పొక్కులు కనిపిస్తున్నాయా? అయితే అది చర్మ అలర్జీ లేదా ఇతర చర్మ సమస్యకు సంకేతం కావచ్చు. వాతావరణంలో మార్పులు, దుమ్ము, కొన్ని రకాల సబ్బులు, డిటర్జెంట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఆహార పదార్థాలు ఇలా అనేక కారణాలు చర్మంపై అలర్జీ ప్రతిచర్యలకు దారితీయవచ్చు.

కొందరిలో ఈ లక్షణాలు కొద్దిసేపటికే తగ్గిపోతాయి. మరికొందరిని మాత్రం రోజుల తరబడి ఇబ్బంది పెడతాయి. దురదగా ఉందని పదే పదే గోకడం వల్ల చర్మం దెబ్బతినడంతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

అందుకే చర్మంపై అలర్జీ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలర్జీకి కారణమయ్యే పదార్థాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం, చర్మాన్ని శుభ్రంగా, తేమగా ఉంచుకోవడం ముఖ్యం. అలాగే చల్లటి కాపడం, సువాసనలు లేని మాయిశ్చరైజర్ వంటి సులభమైన పద్ధతులు దురద, మంట నుంచి ఉపశమనం కలిగించవచ్చు.

అయితే ప్రతి సహజసిద్ధమైన పదార్థం ప్రతి ఒక్కరి చర్మానికి సరిపోతుందని భావించకూడదు. కొత్త పదార్థాలను ఉపయోగించే ముందు జాగ్రత్త అవసరం. సమస్య తీవ్రంగా ఉన్నా, తగ్గకుండా కొనసాగినా వైద్యులను సంప్రదించాలి. మరి చర్మాన్ని ప్రశాంతంగా ఉంచుతూ దురద, చికాకును తగ్గించుకోవడానికి పాటించాల్సిన సులభమైన ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల చర్మానికి తేమను అందించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. IJDVL అధ్యయనం కూడా కొబ్బరి నూనెలోని ఈ గుణాలను ప్రస్తావించింది.

ఈ నూనెలో కొద్దిగా పచ్చ కర్పూరం కలిపి ఉపయోగించడం వల్ల చర్మానికి చల్లదనం కలుగుతుంది.

ఒక చిన్న గిన్నెలో స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకుని, అందులో కొద్దిగా పచ్చ కర్పూరం పొడిని కలపాలి.

కర్పూరం కలిపిన నూనెను చర్మంపై నేరుగా ఉపయోగించే ముందు చిన్న భాగంలో పరీక్షించాలి. అయితే కర్పూరం వల్ల కొందరికి చర్మంపై చికాకు లేదా అలర్జీ కలగవచ్చు. అందువల్ల సున్నితమైన చర్మంపై, గాయాలపై లేదా పిల్లలకు ఉపయోగించకూడదు.

దురద, మంట లేదా అలర్జీ లక్షణాలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *