
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ నుంచి కేవలం రూ.2 విడుదల చేయాలని జీవో జారీ కావడం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్న ఈ శాఖ.. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనుల కోసం ఈ జీవోను జారీ చేసింది.
అయితే కేవలం రూ.2 కోసం జీవో ఎందుకు జారీ చేశారనే ఆసక్తి నెలకొంది. పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణుల సూచన మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.
అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదల కోసం సాధారణంగా జీవోలు జారీ అవుతుంటాయి. అయితే కేవలం రూ.2 కోసం ప్రభుత్వం జీవో జారీ చేయడం మాత్రం అరుదైన విషయంగా చర్చనీయాంశమైంది.
