D Spiritual: Nov 12: అయ్యప్ప మాలధారణ నియమాలు: 41 రోజుల దీక్షలో భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారాలు!

భక్తి, స్వీయ క్రమశిక్షణకు ప్రతీక అయ్యప్ప దీక్ష

హిందువులు ప్రధానంగా ఆరాధించే దేవతామూర్తుల్లో అయ్యప్ప స్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనను హరిహరసుతుడు, మణికంఠుడు అని పిలుస్తారు. అయ్యప్ప స్వామి పూజా సంప్రదాయం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో విస్తరించింది. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు అయ్యప్ప మాలధారణ చేసి దీక్ష చేపడుతుంటారు.

అయ్యప్ప మాలధారణ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. భక్తి నియమాలు, స్వీయ క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ దీక్ష ద్వారా భక్తులు తమ మనసును, శరీరాన్ని భగవంతుడికి అంకితం చేస్తూ స్వామి అయ్యప్పను స్మరించుకుంటారు. అంతేకాకుండా తోటి మనుషులను కూడా భగవంతుని రూపాలుగా భావించి గౌరవిస్తారు.

41 రోజుల పాటు కఠిన నియమాలతో దీక్ష

అయ్యప్ప మాలధారణ చేసేవారు దీక్షా కాలంలో తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మాలధారణ చేసిన భక్తులు 41 రోజుల పాటు కఠినమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణతో వ్రతాన్ని ఆచరించాలి. ఈ సమయంలో భక్తి, నియమ నిష్ఠలు, ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఎవరి చేతుల మీదుగా మాలధారణ చేయాలి?

అయ్యప్ప దీక్ష చేపట్టే భక్తులు గురుస్వామి, కన్నతల్లి లేదా దీక్షలో ఉన్న అర్చక స్వామి చేతుల మీదుగా మాలధారణ చేయాలని వరంగల్ నగరానికి చెందిన అర్చకులు కాళీ ప్రసాద్ శర్మ వివరించారు. మాలధారణతో దీక్ష ప్రారంభమవుతుందని, అప్పటి నుంచి 41 రోజుల పాటు నియమబద్ధమైన జీవనశైలిని అనుసరించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *