విశాఖకు సీఐఐ సమ్మిట్‌ కొత్త కాదని.. సమ్మిట్ ద్వారా ఏపీ బ్రాండ్ వాల్యూను ప్రమోట్ చేయగలిగామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

విశాఖకు సీఐఐ సమ్మిట్‌ కొత్త కాదని.. సమ్మిట్ ద్వారా ఏపీ బ్రాండ్ వాల్యూను ప్రమోట్ చేయగలిగామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు (శనివారం) వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగని విధంగా విశాఖ సీఐఐ సమ్మిట్ జరిగిందని తెలిపారు. ఇంటర్ నేషనల్ స్టాండర్డ్‌తో సమ్మిట్‌ను నిర్వహించారని అన్నారు. సుమారు రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. వచ్చిన పెట్టుబడులను గ్రౌండ్ అయ్యేలా చేశారని చెప్పారు.

దేశంలో వంద రూపాయలు వస్తే.. ఏపీకి 25 రూపాయిలు వస్తున్నాయని కేంద్రమంత్రి అన్నారు. ఫలితంగా ఇక్కడి బిడ్డలకు ఉపాధి వస్తుందని చెప్పుకొచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను హబ్‌గా తయారు చేస్తున్నామని.. ప్రతిరోజూ విమాన సర్వీసులను పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇప్పుడున్న ఎయిర్ సర్వీస్‌తో పాటు కొత్త ఎయిర్ సర్వీస్‌లను తీసుకొస్తున్నామని తెలిపారు. విశాఖ- తిరుపతి, విశాఖ -విజయవాడకు విమానాలను పెంచామని అన్నారు.

తిరుపతి నుంచి గల్ఫ్‌కు విమాన సేవలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీలో చిన్న ఎయిర్‌పోర్టులు పెంచుతామని చెప్పారు. శ్రీకాకుళం, కుప్పం సైట్‌ క్లియరెన్స్‌ ఇచ్చామన్నారు. 2024 కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు కూటమికి వస్తున్నాయన్నారు. శ్రీకాకుళం ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానని.. ప్రచారంలో పాల్గొంటున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *