జూనియర్ ఎన్టీఆర్ కఠిన సాధన.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్

Date:

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో పాటు పాత్ర కోసం చేసే కఠిన సాధనతో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంటారు. గతంలో ‘రాఖీ’ సినిమాలో కొంచెం బరువుగా కనిపించిన తారక్, ‘యమదొంగ’ సమయంలో స్లిమ్ లుక్‌లోకి మారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే అంకితభావంతో తన 31వ చిత్రం NTRNeel కోసం మరోసారి శారీరకంగా భారీ మార్పుతో సిద్ధమవుతున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం తారక్ తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. కేవలం 7 వారాల్లోనే సుమారు 10 కిలోల బరువు తగ్గి ఫిట్ అవతారంలోకి మారినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన కఠినమైన ఫిట్‌నెస్ రొటీన్‌ను పాటిస్తున్నారు.

ప్రతిరోజూ దాదాపు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ, ట్రైనర్ సూచనల మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్‌ను అనుసరిస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తారక్ డెడికేషన్‌ను చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ టొవినో థామస్, కన్నడ నటి రుక్మిణి వసంత్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్‌లో ఉండే మాస్ ఎలిమెంట్స్‌కు ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే ఈ సినిమా థియేటర్లలో భారీ ప్రభావం చూపుతుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుండె ఆరోగ్యానికి ఒంటరితనం కూడా ముప్పే.. ఎందుకో తెలుసా?

గుండె ఆరోగ్యానికి దూరంగా ఉంచాల్సిన 5 అలవాట్లు గుండె ఆరోగ్యం కేవలం కొలెస్ట్రాల్‌,...

అది పులస కాదండోయ్ విలస.. ఆ చేపను కొంటున్నారా అయితే మోసపోయినట్టే!

గోదావరి జిల్లాల ప్రజలకు పులస చేప అంటే ప్రత్యేకమైన అభిమానం. కొత్త...

మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు

పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న...

కాకినాడ బీచ్‌లో యువకులు గల్లంతు.. స్పందించిన పవన్ కళ్యాణ్, రంగంలోకి గజ ఈతగాళ్లు

కాకినాడలోని గుర్రాల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు....