
కావాల్సిన పదార్థాలు
- బార్లీ – 1 కప్పు
- నీరు – 2 కప్పులు
- బెల్లం పొడి – 1 కప్పు
- కొబ్బరిపాలు – అర లీటరు
- యాలకుల పొడి – అర టేబుల్ స్పూన్
- పచ్చి యాలకులు – 6 నుంచి 8
- నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
- ఎండుద్రాక్ష – ఒక గుప్పెడు
- జీడిపప్పు – తగినంత
- ఇతర డ్రై ఫ్రూట్స్, నట్స్ – రుచికి సరిపడా
తయారుచేసే విధానం
- ముందుగా బార్లీని శుభ్రంగా రెండు, మూడు సార్లు కడిగి నీటిని వడకట్టాలి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో బార్లీ, రెండు కప్పుల నీరు పోసి మూత పెట్టాలి. బార్లీ మెత్తగా ఉడికే వరకు 4–5 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి.
- కుక్కర్లోని ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి, ఉడికిన బార్లీలో బెల్లం పొడి వేసి బాగా కలపాలి.
- బెల్లం పూర్తిగా కరిగే వరకు మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత మరో రెండు నిమిషాలు సన్నని మంటపై ఉంచాలి.
- ఇప్పుడు మంట తగ్గించి కొబ్బరిపాలు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మీడియం మంటపై సుమారు 10 నిమిషాల పాటు మెల్లగా ఉడికించాలి. మరీ ఎక్కువగా మరిగించకుండా జాగ్రత్తపడాలి.
- మరో చిన్న పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, ఎండుద్రాక్షలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను పాయసంలో వేసి బాగా కలపాలి. అవసరమైతే మిగిలిన నెయ్యిని కూడా జోడించాలి.
అంతే! ఎంతో రుచికరమైన, పోషకాలతో కూడిన బార్లీ పాయసం సిద్ధం. వేడిగా లేదా చల్లగా మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు.
చిన్న చిట్కా: మరింత రుచి కోసం బాదం, పిస్తా, వాల్నట్స్ వంటి నట్స్‌ను కూడా జోడించుకోవచ్చు.
