
D news:nov:21ఈ జెల్ తయారీకి ముందుగా అవిసె గింజలను నీటిలో వేసి మరిగించాలి. మిశ్రమం జెల్‌లా మారిన తర్వాత వడకట్టి చల్లార్చుకోవాలి. అనంతరం ఇందులో ఒక టేబుల్‌స్పూన్ కలబంద జెల్, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్‌లోని నూనె కలిపి బాగా మిక్స్ చేయాలి.
పొడి చర్మం ఉన్నవారు ఇందులో కొద్దిగా బాదం నూనె లేదా కొబ్బరి నూనె కలుపుకోవచ్చు. అయితే జిడ్డు చర్మం లేదా మొటిమలు వచ్చే చర్మం ఉన్నవారు అదనంగా నూనె కలపకపోవడమే మంచిది.
ఎలా ఉపయోగించాలి?
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, తయారు చేసుకున్న జెల్‌ను పలుచగా అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత చర్మానికి అనుకూలంగా ఉంటే అలాగే ఉంచుకోవచ్చు లేదా కడిగేయవచ్చు. క్రమం తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం మృదువుగా, తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది.
గమనిక: ఈ జెల్‌ను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. చికాకు, దురద లేదా ఎర్రదనం కనిపిస్తే వెంటనే ఉపయోగించడం ఆపేయాలి. ఇంట్లో తయారు చేసిన జెల్‌ను ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా, శుభ్రమైన పాత్రలో ఫ్రిజ్‌లో ఉంచి త్వరగా ఉపయోగించాలి.
