Andhra News: ఫేస్ చూసి అమాయకుడు అనుకోకండి..! ఏం చేశాడో తెలిస్తే అస్సలు క్షమించరు!

Date:

తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్‌గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది. గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు అదే పోస్ట్‌ వాడుకొని భక్తులను మోసం చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

టిటిడిలో పనిచేస్తూ సస్పెండ్ అయిన ఉద్యోగులు భక్తులను నిలువునా మోసగిస్తున్నారు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా అలాంటి ఓ ఉద్యోగే శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. టీటీడీలో ఉద్యోగిగా పనిచేస్తూ సస్పెండ్ అయిన గిరిధర్ అనే వ్యక్తి.. అదే పోస్ట్‌ను వాడుకొని భక్తులను మోసం చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా భక్తులకు తన టీటీడీ ఐడీ కార్డును పంపి సేవా టికెట్ల పేరుతో రూ.1.56 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల గుర్తించారు.

అంతేకాదు టీటీడీ ఉద్యోగం పేరుతో మరో వ్యక్తి నుంచి రూ.3.60 లక్షలు వసూలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇలా దాదాపు రూ.10 లక్షల మేర భక్తలను మోసం చేసి దండుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. దీంతో గిరిధర్‌పై కేసు నమోదు చేసిన తిరుమల టూ టౌన్ పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చారు. కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి 15 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

ఈ ఘటన నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు జిల్లా ఎస్పీ కీలక సూచనలు చేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు దళారులు, నకిలీ వ్యక్తుల మాటలు నమ్మొదని కోరారు. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్, యాప్‌ల ద్వారానే సేవలు పొందాలని సూచిస్తున్నారు. ఎవరైనా తాము టీటీడీ ఉద్యోగులమని, అధికారులమని చెప్తే డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే తమకు సామాచారం ఇవ్వాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...