“జీవితం మారొచ్చు, మనుషులు మారొచ్చు, కానీ నిజమైన స్నేహం ఎప్పటికీ మారదు!”

Date:

భారతదేశం, బంగ్లాదేశ్, మలేషియా, అమెరికా, ఇతర దేశాలు ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాయి. యువతలో అత్యంత ప్రాచుర్యం పొందిన వేడుకలలో ఇది ఒకటి. జీవితంలో సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, దుఃఖాన్ని సగం చేయడానికి ఒక మంచి స్నేహితుడు తోడుగా ఉండటం ఎంతో ముఖ్యం. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, సందేశాలు పంపుకోవడం ద్వారా ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.

స్నేహం అనేది జీవితంలో లభించే అత్యంత విలువైన బంధాలలో ఒకటి. ఇది నమ్మకం, అవగాహన, దయ, మధురమైన జ్ఞాపకాల పునాదిపై నిర్మితమవుతుంది. సంస్కృతులు, తరాలు, సరిహద్దుల్ని దాటి వ్యక్తులను అనుసంధానించే శక్తి స్నేహానికి ఉంది. ఒక నిజమైన తోడు మన జీవితంలోని ప్రతి సవాలును తేలికగా, ప్రతి వేడుకను మరింత ఉత్సాహంగా మారుస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. ప్రతి ఏడాది వచ్చే ‘ఫ్రెండ్‌షిప్ డే’ (స్నేహితుల దినోత్సవం), మన కష్టసుఖాల్లో మనతో పాటు నిలిచిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది.

ఐక్యరాజ్యసమితి జూలై 30వ తేదీన ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ను నిర్వహించగా, భారత్ సహా పలు దేశాలు ఆగస్ట్ ఫస్ట్ సండే‌ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాయి. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టడం, బహుమతులు పంచుకోవడం, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన వేడుకగా మారింది. మీ చిన్ననాటి స్నేహితుడైనా, కాలేజీ రూమ్‌మేట్ అయినా, ఆఫీస్ సహోద్యోగి అయినా లేదా ఈ మధ్యే పరిచయమైన వ్యక్తి అయినా.. వారు అందించే మద్దతుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఫ్రెండ్‌షిప్ డే సరైన సమయం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...