రోహిత్ శర్మ బయోపిక్ రూమర్స్‌పై క్లారిటీ.. ‘బైకర్’ ట్రైలర్ లాంచ్‌లో శర్వానంద్ స్పందన

Date:

టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రోహిత్ శర్మ బయోపిక్ రూమర్స్‌పై ఆయన స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తన ఫిజిక్ రోహిత్ శర్మకు దగ్గరగా ఉంటుందనే చర్చలపై స్పందించిన శర్వానంద్, “రోహిత్ శర్మ జీవితం ఎంతో ప్రేరణాత్మకం. అలాంటి కథ నా దగ్గరకు వస్తే తప్పకుండా నటించడానికి ఆసక్తిగా ఉంటాను” అని తెలిపారు.

ప్రస్తుతం శర్వానంద్ కెరీర్ మంచి జోష్‌లో కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’తో విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘బైకర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదట గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా ప్రతినిధులు శర్వానంద్‌ను రోహిత్ శర్మ బయోపిక్‌పై ప్రశ్నించారు. ఆయన ఫిజిక్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఆ పాత్రకు సరిపోతారని, మరోవైపు ట్రైలర్‌లోని లుక్‌ను చూస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా చేయొచ్చనే అభిప్రాయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సమాధానంగా శర్వానంద్, “ప్రస్తుతం అలాంటి బయోపిక్ గురించి అధికారిక సమాచారం నాకు లేదు. కానీ ఆ అవకాశం వస్తే తప్పకుండా పరిశీలిస్తాను” అని చెప్పారు.

ఈ సందర్భంగా పక్కనే ఉన్న డాక్టర్ రాజశేఖర్ సరదాగా స్పందిస్తూ, “శర్వానంద్ రోహిత్ శర్మ అయితే, నేను ఎంఎస్ ధోనీ అవుతాను” అని వ్యాఖ్యానించడంతో వేడుకలో నవ్వులు పూశాయి.

ఇప్పటికైతే శర్వానంద్ పూర్తి దృష్టి ‘బైకర్’ సినిమాపైనే ఉంది. యాక్షన్‌తో పాటు స్పోర్ట్స్ ఎలిమెంట్స్ మేళవించిన ఈ చిత్రం ఆయనకు మరో హిట్ అందిస్తుందా అన్నది చూడాలంటే ఏప్రిల్ 3 వరకు వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా, రోహిత్ శర్మ బయోపిక్‌పై గత కొంతకాలంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చర్చలు కొనసాగుతున్నాయి. ఆ పాత్రకు ఎవరు సరిపోతారు అనే అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుండగా, శర్వానంద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...