
ఘంటసాల, తెలంగాణ రాష్ట్రంలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ అరికెపూడి గాంధీ దంపతులు సోమవారం ఘంటసాల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలపార్వతీ సమేత జలదీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు చావలి కృష్ణ కిషోర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, ఘంటసాల పీఏసీఎస్ అధ్యక్షుడు బండి పరాత్పరరావు, టీడీపీ నాయకులు వేమూరి రమేష్, షామియానా భాషా తదితరులు అరికెపూడి గాంధీ దంపతులను ఘనంగా సత్కరించారు.
జలదీశ్వర స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు.




