శ్రీ సత్యసాయి బ్యూరో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ సోమవారం ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. ఉదయం 8.18 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ తదితరులు విమానాశ్రయానికి చేరుకుని కేరళ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం సతీశన్ పుట్టపర్తికి విచ్చేశారు.

ఈ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు, సత్యసాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో పుట్టపర్తిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కేరళ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద అధికారులు ప్రత్యేక భద్రతా, స్వాగత ఏర్పాట్లు చేపట్టారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *