భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు శుభవార్త తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలకు హాజరయ్యే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 25న మెట్రో రైలు సేవలను ప్రత్యేకంగా పొడిగించనున్నట్లు వెల్లడించారు. సాధారణ సమయంతో పోలిస్తే అదనంగా రైళ్లను నడిపిస్తూ, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నట్లు అధికారులు తెలిపారు.

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 25న నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సేవలను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగించనున్నట్లు తెలిపారు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే చివరి రైళ్లు ఒంటి గంట సమయానికి తమ గమ్యస్థానంలోని చివరి స్టేషన్‌కు చేరుకునేలా సర్వీసులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

నిమజ్జనం నేపథ్యంలో ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ల వద్ద అదనపు పోలీసు సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను బట్టి అవసరమైన స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అవసరాన్ని బట్టి అదనపు మెట్రో రైళ్లను కూడా నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మెట్రో అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు సేవలు సాధారణ సమయానికి తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *